దర్శనమిచ్చిన అరుదైన పాము....కొట్టి చంపిన గ్రామస్తులు

SMTV Desk 2019-04-26 12:55:05  snake, lycodon flavicollis, lycodon flavicollis snake kills villagers

అనంతపురం: జిల్లా పెనుకొండలో ఓ అరుదైన పామును గ్రామస్తులు కొట్టి చంపారు. ఈ ఘటన స్థానిక మారుతీ నగర్ లో చోటు చేసుకుంది. ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లోని పాత సామాన్లు తీస్తున్న సమయంలో అరుదైన పాము అతన్ని కాటేసింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పామును కొట్టి చంపేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సదా శివయ్య ఈ పామును పరిశీలించారు. ఇది అరుదైన పాము అని, ఈ పాము విష రహితమని ఆయన తెలిపారు. దీన్ని లైకోడాన్‌ ఫ్లబికొల్లిస్‌ అన్న శాస్త్రీయనామంతో పిలుస్తారని ఆయన చెప్పారు. తిరుమల కొండల్లో మాత్రమే ఈ పాములు కనిపిస్తాయని ఆయన వెల్లడించారు.