ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్‌ కస్టమర్లకు హెచ్చరికలు!

SMTV Desk 2019-04-26 12:20:04  state bank of india, sbi, sbi net banking

ముంభై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా(ఎస్బీఐ) కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్‌బీఐ ఆన్‌లైన్ సేవలు ఉపయోగిస్తున్నవారు తమ మొబైల్ ఫోన్ నెంబర్ ను బ్యాంక్ రికార్డుల్లో అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిరంతరాయంగా పొందడం వీలుకాదు అని కస్టమర్లను హెచ్చరించింది. ఇక ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు మొబైల్ నెంబర్‌ను ఈ విధంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. మొదట ఎస్‌బీఐ పోర్టల్ www.onlinesbi.comకు వెళ్లి ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి. అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి తర్వాత ప్రొఫైల్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోండి. పర్సనల్ డీటైల్స్/మొబైల్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పర్సనల్ డీటైల్ పేజ్ ఓపెన్ అవుతుంది. తరువాత ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి. మీ పేరు, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటి వివరాలతో కూడిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఛేంజ్ మొబైల్ నెంబర్‌ హైపర్‌లింక్‌పై క్లిక్ చేయండి. ఆ తరువాత పర్సనల్ డీటైల్స్-మొబైల్ నెంబర్ అప్‌డేట్ పేజ్‌ కనిపిస్తుది. దాంట్లో కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రెండో బాక్స్ లో మళ్లీ రీటైప్ చేసి తర్వాత సబ్‌మిట్ చేయండి. మీకు వెరిఫై అండ్ కన్ఫర్మ్ యువర్ మొబైల్ నెంబర్ అనే పాపప్ మెసేజ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మొబైల్ నెంబర్ ఓటీపీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ త్రూ ఏటీఎం, అప్రూవల్ త్రూ కాంటాక్ట్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటాయి. వీటిల్లో మీరు దేనినైనా ఎంచుకోవచ్చు. ఓటీపీ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకుంటే పాత నెంబర్, కొత్త నెంబర్ రెండు మీ వద్ద ఉండేలా చూసుకోండి. ప్రొసీడ్‌పై క్లిక్ చేసిన తర్వాత డెబిట్ కార్డు ఆప్షన్ కనిపించే అకౌంట్ ఎంచుకోండి. మళ్లీ ప్రొసీడ్‌పై క్లిక్ చేస్తే అకౌంట్‌తో అనుసంధానమైన ఏటీఎం కార్డుల వివరాలు కనిపిస్తాయి. యాక్టివేటెడ్ ఏటీఎం కార్డు ఎంపిక చేస్తే ఎస్‌బీఐ పేమెంట్ గేట్‌వే ఓపెన్ అవుతుంది. కార్డు వివరాలు ఇచ్చి ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి. ఒక రెఫరెన్స్ నెంబర్‌తోపాటు ఓటీపీ మీ పాత, కొత్త మొబైల్ నెంబర్లకు మెసేజ్ వస్తుంది. తర్వాత మీ కొత్త నెంబర్ యాక్టివేషన్ కోరుతూ 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే చాలు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ ఆప్షన్ ఎంచుకుంటే డెబిట్ కార్డు అవసరం అవుతుంది. డెబిట్ కార్డు కలిగిన అకౌంట్‌ను ఎంచుకొని ప్రొసీడ్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఎస్‌బీఐ పేమెంట్ గేట్‌వే ఓపెన్ అవుతుంది. వివరాలు అన్ని ఇవ్వాలి. కొత్త మొబైల్ నెంబర్‌కు రెఫరెన్స్ నెంబర్ మెసేజ్ వస్తుంది. ఈ రెఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత ఎస్‌బీఐ ఎటీఎంకు వెళ్లాలి. కార్డును స్వైప్ చేయాలి. సర్వీసెస్ ట్యాబ్ ఎంచుకోవాలి. పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదర్స్ అనే ట్యాబ్ ఎంచుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. పది అంకెల రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి.