ఆర్.ఆర్.ఆర్ సినిమాలో జాక్వెలిన్

SMTV Desk 2019-04-26 12:15:43  Jaqwulin Fernandez,

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. సినిమాలో అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ ను హీరోయిన్స్ గా తీసుకోగా డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుండి క్విట్ అయ్యింది. ఇక ఆమె ప్లేస్ లో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు ఆర్.ఆర్.ఆర్ యూనిట్. నిత్యా మీనన్, శ్రద్ధా కపూర్, పరిణీతి చోప్రా ఇలా అందరి పేర్లు వినపడుతున్నాయి.

అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో డైసీ ప్లేస్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను తీసుకోమని సలహా ఇచ్చాడట సల్మాన్ ఖాన్. శ్రీలంక బ్యూటీ అయిన జాక్వెలిన్ సల్మాన్ ఖాన్ కిక్ సినిమాలో నటించింది. సల్మాన్ ఫ్రెండ్ గా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ సాగిస్తున్న జాక్వెలిన్ గురించి రాజమౌళికి రికమెండ్ చేశాడట సల్మాన్. మరి సల్మాన్ ఖాన్ సలహాని రాజమౌళి పాటిస్తాడా లేదా అన్నది చూడాలి