సైరా నరసింహా రెడ్డి లో అనుష్క

SMTV Desk 2019-04-26 12:11:34  anuska, anushka

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలో అనుష్క కూడా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. నయనతార ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా సినిమాలో తమన్నా కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో అనుష్క కూడా ఉంటున్న మాట వాస్తవమే అట. అనుష్క ఉంటుంది కాని కనిపించదు అదేంటి అంటే సైరా కథను అనుష్క వాయిస్ తోనే మొదలు పెడతారట.

సినిమా స్టార్టింగ్ లో ఆమె వాయిస్ తోనే కథలోకి వెళ్తామట. మొత్తానికి సురేందర్ రెడ్డి సైరా సినిమాను ఆశించిన స్థాయిలోనే తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్ లో తెరకెక్కిస్తున్న సైరా సినిమాను రాం చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్న సైరా సినిమా అఫిషియల్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు.