టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న RR

SMTV Desk 2019-04-26 12:10:22  IPL 2019, KKR VS RR

కోల్ కత్తా: ఈడెన్ గార్డెన్ వేదికగా నేడు కోల్ కత్తా నైట్ రైడర్స్ తో రాజస్తాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో 10 మ్యాచ్ లు ఆడిన కోల్ కత్తా నాలుగు మ్యాచ్ లో గెలవగా ఆరు మ్యాచ్ లు ఓడిపోయింది. -0.013 రన్ రేట్ తో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక రాజస్తాన్ కూడా 10 మ్యాచ్ లు ఆడి 3 మ్యాచ్ లు గెలుపొందగా మిగితా 7 మ్యాచ్ లు పరాజయపాలైంది. -0.470 రాన్ రేట్ తో 6 పాయింట్లను ఖాతాలో వేసుకొని పట్టికలో చివరి స్థానంలో ఉంది.