మీ భ‌ర్త‌లు మీరు చెప్పిన‌ట్లు ఓటు వేస్తేనే.. వారికీ అన్నం పెట్టండి

SMTV Desk 2019-04-25 18:02:11  Nitish, Nitish kumar

రాబోయే ఎన్నికల్లో నెగ్గాలంటే రాజకీయనేతలు కొత్త కొత్త పద్దతులతో జనాలని ఆకర్షిస్తున్నారు .. అయితే బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా ఎన్నిల ప్రచారంలో వింత ధోరణిని ప్రదర్శించారు. ఓటర్లలో మహిళా ఓటర్లు వేరయా అనుకున్నట్టున్నారు. మగాళ్లు వినాలంటే ఆడవాళ్ల నుంచి నరుక్కురావాలని భావించినట్టున్నారు.

మీ భ‌ర్త‌లు మీరు చెప్పిన‌ట్లు ఓటు వేస్తేనే.. వారికి ప్రేమ‌తో అన్నం పెట్టాల‌ని, లేదంటే వాళ్లకు ఆ రోజు అన్నం పెట్ట‌వ‌ద్దు అని పిలుపునిచ్చారు.

మధుబనిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నితీశ్‌ అక్కడ ఉన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. బిజెపి ఎంపి హుకందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ కుమారుడు, ఎన్‌డిఎ అభ్యర్థి అశోక్‌ యాదవ్‌ తరఫున నితీశ్‌ ప్రచారంలో పాల్గొన్నారు.ఆడ‌పిల్ల‌ల‌కు సైకిళ్లు ఇవ్వడం, మ‌ద్యాన్ని నిషేధించడం, క‌న్యా వికాస్‌, ముఖ్య‌మంత్రి నాప్కిన్ యోజ‌న వంటి పథకాలు చేపట్టారు. మరి తాజా వ్యాఖ్యతో మహిళలు వాళ్ల భర్తలకు నితీష్‌కే ఓటు వేయాలని చెప్తారా లేదా అన్నది సస్పెన్సే.