చేతులు లేకున్నా హ్యాండ్‌ రైటింగ్‌ కాంపిటీషన్‌లో ఛాంపియన్‌

SMTV Desk 2019-04-25 17:59:57  Sara wins national handwriting championship

అమెరికా: పుట్టుకతో రెండు చేతులు కోల్పోయిన ఓ చిన్నారి జాతీయ హ్యాండ్‌ రైటింగ్‌ కాంపిటీషన్‌లో ఛాంపియన్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వార్తకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి. 10ఏళ్ల ఈ చిన్నారికి పుట్టుక నుంచి చేతులు లేకపోయినా.. అమెరికాలో జరిగిన జాతీయ హ్యాండ్‌ రైటింగ్‌ కాంపిటీషన్‌లో ఛాంపియన్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫ్రెడెరిక్‌ లోని సెయింట్‌ జాన్స్‌ రీజనల్‌ క్యాథలిక్‌ స్కూల్‌లో థార్డ్‌ క్లాస్‌ చదువుతున్న సారా.. రెండు చేతుల మణికట్టుతో అద్భుతాలు చేసి చూపిస్తోంది. కేవలం చేతి రాతే కాదు.. అందమైన పెయింటింగ్‌, శిల్పాలను కూడా తయారు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.