సైలెన్సర్ తీసి బైక్ నడిపితే కేసు!

SMTV Desk 2019-04-25 16:56:24  andhrapradesh, guntoor traffic police, dsp supraja

అమరావతి: గుంటూరులో ట్రాఫిక్ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించి స్నేక్, ఫైర్ కటింగ్ డ్రైవ్ చేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారి దగ్గర నుంచి 12 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డిఎస్పీ సుప్రజ మాట్లాడుతూ… సైలెన్సర్ తీసేసి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు పెడతామని, అదేవిధంగా, వాహనాలకు సైలెన్సర్లు తీసి వేసే మెకానిక్ లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులు హెచ్చారించారు.