మరో హీరోయిన్ కి లైంగిక వేధింపులు .. కేసు నమోదు

SMTV Desk 2019-04-25 15:51:43  lawrence, case,

సినిమా రంగంలో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు తరుచు చూస్తూనే ఉన్నాం .. మీటు అని, క్యాస్టింగ్ కౌచ్ అని ఎన్ని ఉద్యమాలు వచ్చినా అమ్మాయిలపై ఆగడాలకు అడ్డుకట్ట పడటంలేదు. తాజాగా ఓ రష్యన్ నటిని వేధించిన ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రష్యాకు చెందిన ఓ మహిళ(34) తన భర్త పిల్లలతో కలిసి చెన్నైకి వచ్చింది. గత పదేళ్లుగా ఎంఆర్‌సీ నగర్‌లో నివాసం వుంటోంది. ఆమె ఇటీవల విడుదల అయిన లారెన్స్ చిత్రం ‘కాంచన3’లో నటించింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తోంది. ఆమెతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన రుబేశ్ కుమార్(26) అనే వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది బాధిత మహిళ.అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు మాధవరం, పొన్నియమ్మన్ మేడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.