మార్కెట్లో రిలీజ్ కాని ఫోన్ పోయింది...తిరిగిస్తే రూ.4 లక్షలు

SMTV Desk 2019-04-25 15:49:24  honor, honor phone

జర్మనీ: మార్కెట్లో రిలీజ్ కాని స్మార్ట్ ఫోన్ పోగొట్టుకొని తిరిగిచ్చిన వారికి నలుగు లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించాడు ఓ ఉద్యోగి. వివరాల ప్రకారం...హువావే సబ్‌బ్రాండ్ హానర్‌కు సంస్థలో సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న ఉద్యోగి ఏప్రిల్‌ 22న జర్మనీ రాజధాని మ్యూనిచ్‌కి రైల్లో వెళుతుండగా హానర్‌ మొబైల్‌ను పోగొట్టుకున్నాడు. దీంతో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న ప్రోటో టైప్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి ఇవ్వాలని హువావే విజ్ఞప్తి చేసింది. గ్రే ప్రొటక్టివ్‌ కవర్‌తో ఉన్న హానర్‌ మొబైల్‌ను సురక్షితంగా తిరిగి ఇచ్చిన వారికి రూ.4 లక్షల బహుమతి ఇస్తానని హానర్‌ ట్వీట్‌చేసింది. కాగా ఈ ఏడాది మే 21 లండన్‌లో నిర్వహించనున్న ఒక ఈవెంట్‌లో హానర్‌ 20 సిరీస్‌లో భాగంగా హానర్‌ 20 ప్రొ, హానర్‌ 20ఏ, హానర్‌ 20సీ, హానర్‌ 20 ఎక్స్‌ తదితర స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. ఉద్యోగి పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌ వీటిల్లో ఒకటి కావచ్చని పలువురు భావిస్తున్నారు.