చదువు కంటే జీవితం ముఖ్యం : నాని

SMTV Desk 2019-04-25 15:48:23  Life, Nani, Inter

ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో గందర గోళం ఏర్పడ్డ సంగతి తెలిసిందే .. అయితే ఈ నేపథ్యం లో నాచురల్ స్టార్ నాని ఎమోషనల్ ట్వీట్ చేసాడు .. చదువు కంటే జీవితం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. చదువంటే మార్కుల పత్రాలు కాదని, కేవలం నేర్చుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. చదువుకంటే జీవితంలో చాలా విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయని ఆయన తెలిపారు. సమస్యలను ఎదుర్కోవాలే తప్ప తనువు చాలించవద్దని ఆయన కోరారు. క్షణికావేశంలో తీసుకునే ఇటవంటి నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు తీరని శోకంలో మునిగిపోతున్నారని, అందువల్ల విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.