అభిమానులే నా బిల్లులను పే చేసారు : విజయ్ దేవరకొండ

SMTV Desk 2019-04-25 14:07:33  Vijay Devarakonda,

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ .. వరుస విజయాలతో చెలరేగుతున్నాడు .. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు .. అయితే ఇటీవల మీడియా తో అతడు తన ఇష్టా ఇష్టాలు షేర్ చేసుకున్నాడు ... తన వద్ద డబ్బు లేకున్నా, బతికేస్తానన్న నమ్మకం తనకు ఉందని, కొన్ని సార్లు తన దగ్గర డబ్బు లేవని, అప్పుడు తన అభిమానులే బిల్లులను చెల్లించారని ఆయన చెప్పుకొచ్చారు. జీవితంలో అభిమానులను సంపాదించుకుంటే చాలన్న విషయం తనకు అర్ధమైందని ఆయన పేర్కొన్నారు. దీంతో డబ్బు లేకున్నా బతికొచ్చన్న విషయం అర్ధమైందని, అయితే చేతిలో సెల్ ఫోన్ లేకుండా మాత్రం బతకలేనని, తన చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తిండి విషయంలో కూడా ఎప్పటికప్పడు తన ఇష్టాలు మారిపోతుంటాయని ఆయన పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ త్వరలోనే విడుదల కానుంది.