టాప్ 2లో రిలియన్స్ జియో.....కిందికి పడిపోయిన ఎయిర్‌టెల్

SMTV Desk 2019-04-25 14:06:22  india top telecom service, airtel, Vodafone, jio

టెలికం దిగ్గజం రిలియన్స్ జియో దేశంలోనే రెండో అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించింది. ఇదివరకు రెండో స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోగా వొడాఫోన్ ఐడియా అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్ జియోకి 30.6 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. అదేసమయంలో ఎయిర్‌టెల్‌కు 28.4 కోట్ల మంది యూజర్లున్నారు. ఇక వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్ల సంఖ్య 38.7 కోట్లుగా ఉంది. రిలయన్స్ జియో అతిత్వరలోనే వొడాఫోన్ ఐడియాను కూడా దాటేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే మూడు నుంచి నాలుగు త్రైమాసికాల్లో జియో.. వొడాఫోన్‌ ఐడియాను వెనక్కు నెట్టేయవచ్చని భావిస్తున్నారు. భారతీ ఎయిర్‌టెల్.. ఇండియన్ టెలికం రంగాన్ని దాదాపు దశాబ్ద కాలంపాటు శాసించింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ అనూహ్యంగా 3వ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. వొడాఫోన్, ఐడియా విలీనంతో ఎయిర్‌టెల్ రెండో స్థానానికి వచ్చింది. ఇప్పుడు జియో కారణంగా మూడో స్థానానికి పడిపోయింది.