మయన్మార్‌లో కొండ చరియలు విరిగి 50 మంది మృతి

SMTV Desk 2019-04-25 14:05:24  Myanmar, myanmar hills breakdown

మయన్మార్: కొండ చరియలు విరిగి 50 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన మయన్మార్‌లో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన వివరాలిలా ఉన్నాయి...ఉత్తర మయన్మార్‌లోని జేడ్ మైనింగ్ కేంద్రంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కచిన్ స్టేట్‌లోని హెచ్‌పాకంత్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలం నుంచి 3 మృతదేహాలను వెలికితీశామని, ఇంకా 54 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మయన్మార్ ప్రజాప్రతినిధి టిన్‌సోయ్ తెలిపారు. కార్మికులంతా మైనింగ్ స్థలంలోని బురదలో చిక్కుకున్నారు. దీంతో సహాయక చర్యలు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.