రైతుల్ని, పేదల్ని గాలికి వొదిలేసారు

SMTV Desk 2019-04-25 13:20:04  Modi, rahul Gandhi,

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు గుప్పించారు ఆయన తను ఎంపిక చేసుకున్న 15 మంది ప్రయోజనాలనే కాపాడుతున్నారని, రైతుల్ని, పేదల్ని గాలికి వదిలేశారని తీవ్రంగా ఖండించారు . ఖేరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న జాఫర్ అలీ నక్వీ, నిఘాసన్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీచేస్తున్న అతల్ శుక్లా విజయంకోసం రాహుల్ ఇక్కడి ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు. 14 రోజుల్లో ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లోని చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తుందని ఇంతకు ముందు ఖేరీలో పర్యటించినప్పుడు మోడీ ఇచ్చిన హామీని కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్తుచేశారు. ‘మరి ఈ అయిదేళ్లలో ఏ హామీ అయినా నెరవేరిందా?’ అని ప్రశ్నించారు. ‘2014 ఎన్నికల్లో మోడీ… అచ్ఛే దిన్ (మంచి రోజులు), రెండు కోట్ల ఉద్యోగాలు, వంటి ఎన్నో హామీలిచ్చారు. కానీ ఏదీ కూడా నిజం కాలేదు’ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంచాయితీల్లో పది లక్షల మందికి ఉపాధి కల్పించడమే కాక, ఏడాదిలోగా 22 లక్షల ప్రభుత్వోద్యోగాలను సృష్టిస్తుందని రాహుల్ చెప్పారు. స్వయం ఉపాధిని కల్పించేందుకు మొదటి మూడేళ్లలో కొత్త పరిశ్రమలకు అనుమతి ఇవ్వదని కూడా పేర్కొన్నారు.