పెళ్లి పత్రికలలో తప్పనిసరిగా వధూవరుల పుట్టిన తేదీలు

SMTV Desk 2019-04-25 13:11:59  wedding cards, Date of birth

రాజస్థాన్ అధికారులు ఒక సరికొత్త విధానాన్ని తెరలేపింది .. పెళ్లి పత్రికల విషయమై వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి పెళ్లి పత్రికలలో తప్పనిసరిగా వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించాలని ఆదేశాలు జారిచేశారు. బాల్యవివాహాలకు అడ్డుకట్టవేసేందుకు ఆ రాష్ట్ర అధికారులు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చూట్టారు. బాల్యవివాహాలపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి అవి యథేచ్ఛగా సాగుతూనే ఉండటంతో రాజస్థాన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని బుండీ జిల్లాలో మెుదలుపెట్టారు. పెళ్లి పత్రికల్లో వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించాలని జిల్లా అధికారులు ప్రజలకు చెబుతున్నారు. ఎక్కువగా బుండీ జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతుండటంతో వాటిని అడ్డుకట్ట వేయడం కోసం అధికారులు ప్రత్యేకంగా ఆ జిల్లాపై దృష్టి సారించారు. పుట్టిన తేదీతో పాటు బాల్యవివాహాలు నేరం అని కూడా ముద్రించాలని సూచించారు. ఈ మేరకు ప్రింటింగ్‌ ప్రెస్సులకు సైతం ఆదేశాలు జారీ చేస్తున్నారు.