విమానం అంటే ఇష్టం .. కానీ ఆ విమానమే ప్రాణాలు తీసింది ?

SMTV Desk 2019-04-25 12:17:57  Andhra Pradesh, eroplane

ఆంధ్రప్రదేశ్‌ లో దారుణం చోటుచేసుకుంది .. వివరాల్లోకి వెళితే ... గుంటూరు జిల్లా... అచ్చంపేట మండలం... బంగారు తండాకు చెందిన 13 ఏళ్ల కైలాష్ నాయక్‌కి విమానం అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే... ఆగిపోయి మరీ చూసేవాడు. తాజాగా మరోసారి అలాంటి విమానం ఒకటి ఆకాశంలో వస్తున్నట్లు కనిపించింది. డాబా పైకి వెళ్లి చూస్తే... అది మరింత పెద్దగా కనిపిస్తుందన్న ఆశతో... గబగబా డాబా ఎక్కాడు. దూరం నుంచీ వస్తున్న విమానాన్ని ఆశగా చూస్తుండసాగాడు. అది మెల్లమెల్లగా దగ్గరకు వస్తుంటే... శబ్ద తీవ్రత పెరగసాగింది. సరిగ్గా విమానం నడి నెత్తిన వెళ్తున్న సమయంలో... దాని సౌండ్ మరీ ఎక్కువగా రావడంతో... ఆ శబ్దాన్ని కైలాష్ తట్టుకోలేకపోయాడు. వెంటనే అతనికి గుండె ఆగి అక్కడిక్కక్కడే మృతి చెందాడు ..

ఇది ఇలా ఉండగా .. కైలాష్ తల్లి తండ్రుల సమాచారం ప్రకారం కైలాష్‌కి 8 ఏళ్ల వయసు నుంచే గుండె సంబంధిత సమస్యలున్నాయి. తరచూ డాక్టర్లకు చూపిస్తూనే ఉన్నారు. పెద్ద శబ్దాలు, షాకింగ్ న్యూస్ వంటివి అతనికి చెప్పొద్దని డాక్టర్లు సలహా ఇచ్చారు. అందుకే పేరెంట్స్ ఎప్పుడూ టీవీలో వాల్యూమ్ చాలా చిన్నగానే పెట్టుకుంటున్నారు. అలాంటిది విమాన శబ్దం ప్రాణం తీసేస్తుందని ఎవరు మాత్రం ఊహిస్తారు. కన్న కొడుకు కన్నుమూడయంతో... ఆ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.