ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టిన భద్రతా బలగాలు

SMTV Desk 2019-04-25 12:17:01  firings between indian army and terrorists, terrorists, jammukashmir

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో తాజాగా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టారు. అనంత్‌నాగ్ జిల్లాలోని బాగేందర్ మొహల్లా వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. బలగాల రాకను గమనించిన ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలిలో భారీగా మందుగుండు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పారామిలట్రీ బలగాలకు, తీవ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.