మధుమేహ బాధితులకు ఒక చక్కటి చిట్కా

SMTV Desk 2019-04-25 12:15:43  Diabeties.. remedy

మధుమేహవ్యాధిమీద పసుపుని దివ్యాస్త్రంగా ప్రయోగించగలిగే ఒక అద్భుత ఫార్ములా వుంది .

ఉసిరికాయలు ఎండబెట్టినవి పచారీ షాపుల్లో దొరుకుతాయి . సీజన్లో కాయలు సేకరించి మీరు ఎండభేట్టుకోవచ్చు కూడా . ఎండిన ఉసిరికాయని తేలికగా దంచి లోపల గింజలు తీసేయండి . ఈ ఉసిరి పైబెరడు ఎంత వుందో అంతకు సమానంగా మంచి పసుపుకొమ్ములు తీసుకొని రెండిటినీ కలిపి దంచడంగానీ ,మర ఆడించడం గానీ చేయండి .


1. చెంచా మోతాదులో రోజూ రెండు మూడుసార్లు ఈ పొడిని నేరుగాగాని,మజ్జిగలో కలుపుకొని గాని తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయి త్వరగా తగ్గుతుంది . ఈ పొడిని తీసుకొంటూ ,మీరు మాములుగా వాడుకునే మందులు యథాప్రకారం వాడుకోండి . క్రమేణా షుగర్ శాతం తగ్గిపోయి ,ఇతర మందుల మోతాదు
తగ్గించుకొనే అవకాశం వస్తుంది . ఒక దశలో ఈ పొడి మాత్రమే సరిపోయిన సరిపోవచ్చు .

నిశా అంటే పసుపు ఆమలకి అంటే ఉసిరి ,పసుపు ,ఉసిరి మిశ్రమం కాబట్టి దీన్ని నిశామలకీ చూర్ణం అంటారు .

మధుమేహరోగులు ఈ చూర్ణాన్ని విధిగా తీసికోవాలి . దీని వలన మధుమేహవ్యాధులో శరీర ధాతువులు క్షిణించకుండా నిరోధించబడుతుంది . ఇదీ లాభం .