చైనా మరో అద్భుత కట్టడం...ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రం

SMTV Desk 2019-04-25 12:14:23  Beijing new Daxing airport, china

బీజింగ్: అధ్భుత కట్టడాల్లలో ముందుండే చైనా తాజాగా మరో భారీ కట్టడాన్ని నిర్మించేందుకు సిద్దమవుతుంది. చైనా రాజధాని బీజింగ్ కు సమీపంలో బీజింగ్ డాక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రంగా తీర్చి దిద్దేందుకు రెడీ అవుతుంది. దీన్ని ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 12 బిలియన్ డాలర్ల వ్యయంతో, ఫీనిక్స్ పక్షి ఆకారంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. దివంగత బ్రిటిష్ ఆర్కిటెక్ట్‌ జాహ హదీద్‌ దీని రూపశిల్పి. అయితే ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయంగా అట్లాంటాలోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేరుగాంచింది. అన్ని అంశాల్లో అట్లాంటా ఎయిర్ పోర్టును అధిగమించేలా బీజింగ్ డాక్సింగ్ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది.