సంక్రాంతి బరిలో రజిని , ప్రభాస్, మహేష్ ...

SMTV Desk 2019-04-25 12:13:06  rajinikanth, Prabahs, Mahesh

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇపుడు ప్రిన్స్ మహేష్ బాబు, బాహుబలి ప్రభాస్‌లను టార్గెట్ చేసాడు. అసలు రజినీకాంత్ ఏంటి..ప్రభాస్, మహేష్ బాబులను టార్గెట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..ఏం లేదు.. ప్రస్తుతం రజినీకాంత్, మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్‌గా ముంబాయిలో ప్రారంభమైంది. ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సరిగ్గా వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు..అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో పట్టాలెక్కించనున్నాడు మహేష్ బాబు.ఇంకో వైపు ప్రభాస్ కూడా ‘సాహో’ సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఈసినిమా షూటింగ్ చేస్తున్నారు.