మళ్ళీ నోరు జారిన రాహుల్!

SMTV Desk 2019-04-25 12:11:07  rcb vs kxip, ipl 2019, kl rahul

బెంగళూరు: బుధవారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టుపై బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ ఆటగాడు కెఎల్ రాహుల్ బూతులు మాట్లాడారు. అనంతరం ఆయన కంగారుపడ్డారు. మైక్రోఫోన్‌ ద్వారా ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తూనే మాట్లాడుతుంటారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లేయింగ్ కండిషన్స్‌పై నిన్న జరిగిన మ్యాచ్ లో రాహుల్ మాట్లాడుతున్నాడు. పంజాబ్ బౌలర్ మహ్మద్ షమీ రెండో ఓవర్ వేస్తున్నాడు. షమీ వేసిన ఐదో బంతి ఆర్సిబి ఓపెనర్ పార్థివ్ పటేల్ బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌కు తగిలి వికెట్ల పక్క నుంచి బౌండరీకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రాహుల్ బూతులు మాట్లాడారు. తక్షణమే ఆయన తన కాలర్‌కు మైక్ ఉందన్న విషయం గుర్తొచ్చి కంగారుపడ్డాడు. తాను మాట్లాడిన బూతుల గురించి కామెంటేటర్లను అడిగాడు. వ్యాఖ్యలు కెమెరాలో రికార్డయ్యాయో లేదో ఒక సారి చెక్ చేయాలని ఆయన కామెంటర్లను కోరాడు. రాహుల్ బూతులు మాట్లాడడం చర్చనీయాంశమైంది.