బన్నీ- త్రివిక్రమ్ సినిమా షురూ ...

SMTV Desk 2019-04-24 19:56:34  Bunny trivikram,

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కనుంది. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈరోజు సెట్స్ మీదకు వెళ్లింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ఈరోజు మొదలైంది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో టబు, సత్యరాజ్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, బ్రహ్మాజి, రావు రమేష్, మురళి శర్మ, రాహుల్ రామకృష్ణ వంటి వారు నటిస్తున్నారు.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రం, అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబోగా ఈ మూవీ వస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆరంభం అదరగొట్టారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన వీడియో రిలీజ్ చేశారు. యూనిట్ అంతా సినిమా షూటింగ్ కు రెడీ చేస్తున్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణలు కూడా షూటింగ్ స్పాట్ లో ఉన్నారు. ఫైనల్ గా త్రివిక్రం రెడీ కెమెరా యాక్షన్ అని షూటింగ్ మొదలు పెడతాడు. మొత్తానికి ఏఏ19 అలా మొదలైందన్నమాట.