వడదెబ్బ తగులకుండా ఓ పానీయం

SMTV Desk 2019-04-24 19:54:54  sun stroke,

వేసవికాలం వచ్చిందంటే ఇంట్లోంచి బైటకు వెళ్లినా ,ఈ పవర్ కట్ రోజుల్లో ఇంట్లో వున్నా కూడా వడదెబ్బతగుల్తూనే వుంటుంది .

ఓ గ్లాసు మజ్జిగ తీసుకోండి . అందులో ఒక నిమ్మకాయరసం పిండి కలపండి . పంచదార ఉప్పు తగినంతవేసి ,చిటికెడంత తేనెసోడా ఉప్పు [సోడా బైకార్బ ]కూడా కలపండి . వడదెబ్బని తగలకుండా నిరోధించే పానీయం తయారైపోయింది .
దీన్ని ఇంట్లోంచి బైటకు వెళ్లినప్పుడు తాగండి -బైటనుంచి ఇంట్లోకి వచ్చాక కూడా తాగండి . ఇంట్లోనే వున్నా సరే గాలి ఆడక ఉడుకిపోయి విపరీతంగా చెమటపట్టి వడకొట్టవచ్చు కూడా అందువలన ఇంటిల్లీపాది రోజూ ఈ పానీయాన్ని వేసవికాలం అంతా తాగండి .