ఐపీఎల్ ను వీడుతున్న విదేశి ఆటగాళ్ళు

SMTV Desk 2019-04-24 19:20:43  ipl 2019, icc world cup 2019, chief msk prasad

ఈ ఐపీఎల్ సీజన్ కు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఐపీఎల్ టీమ్స్ లల్లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లను మే నెల ఆరంభంలోనే స్వదేశానికి వచ్చేయాలని ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఆటగాళ్లని ఆదేశించాయి. దీంతో.. మరో వారంలో దాదాపు 18 మంది విదేశీ క్రికెటర్లు భారత్‌ని వీడనున్నారు. అయితే న్యూజిలాండ్ క్రికెటర్లు మాత్రం టోర్నీ ముగిసే వరకూ భారత్‌లోనే ఉండనుండగా.. వెస్టిండీస్, శ్రీలంక, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నుంచి మొయిన్ అలీ, డేల్ స్టెయిన్, స్టాయినిస్, హెన్రిచ్ క్లాసెన్ వెళ్లనున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి జోస్ బట్లర్, బెన్‌స్టోక్స్, స్టీవ్‌స్మిత్, జోప్రా ఆర్చర్ స్వదేశానికి వెళ్లనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, షకీబ్ అల్ హసన్, ముంబయి ఇండియన్స్ టీమ్ నుంచి జాసన్ బెరండ్రాఫ్, డికాక్‌ వెళ్లనున్నారు. అలాగే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నుంచి డేవిడ్ మిల్లర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి కగిసో రబాడ వెళ్లనున్నాడు. ఇక చివరగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి జో డెన్లీ వెళ్లనున్నాడు.