నాని సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్న మేఘా ఆకాశ్

SMTV Desk 2019-04-24 19:18:55  Nani, Megha Akash

టాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా గ్యాంగ్ లీడర్ రూపొందుతోంది. ఆల్రెడీ ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో మొదలుకానున్న ఈ షెడ్యూల్లో సెక్సీ బ్యూటీ మేఘా ఆకాశ్ జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఆమె నటిస్తోంది.

నితిన్ తో చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో వెనుకబడిపోయిన ఈ అమ్మాయి, నాని సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే తన కెరియర్ ఊపందుకుంటుందని ఆశపడుతోంది. ఈ సినిమాతో ఈ అమ్మాయి ఆశ నెరవేరుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో మరో కథానాయికగా ప్రియాంక అరుళ్ నటిస్తోంది. తెలుగులో ఈ అమ్మాయి తొలి సినిమా ఇదే. ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా కనిపించనుండటం విశేషం.