తప్పు చేసింది ఒకరు, శిక్ష మరోకరికా?

SMTV Desk 2017-08-20 16:56:36  Upcoming Heroine, Director Chalapati, southern film industry, actor Srujan, Sexual harassment

విజయవాడ, ఆగస్ట్ 20: ఇటీవల సినిమా అవకాశం ఇస్తానని వర్ధమాన నటిపై లైంగిక వేధింపులకు గురిచేశారని దర్శకుడు చలపతి, హీరో స్టీఫెన్ కు రిమాండ్ విధించిన విషయం సుపరిచితమే. ఈ తరుణంలో బాధితురాలు ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, విజయవాడ పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పు చేసిన సృజన్‌ను వదిలేసి, మరో వ్యక్తిని రిమాండ్‌కు తరలించారని ఆరోపించింది. అందుకే అరెస్ట్ చేసిన వ్యక్తి తలకు ముసుగు వేశారు. తనకు సృజన్ నుండి ప్రాణహాని ఉందంటూ ఆందోళన బయట పెట్టింది. తనకు న్యాయం జరగాలని విన్నవించుకుంది. సృజన్ తరపు న్యాయవాది డబ్బుల కోసమే ఇలా చేసిందంటూ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించింది.