ఇంటర్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్....ఫ్రీగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్

SMTV Desk 2019-04-24 19:16:40  inter

హైదరాబాద్: ఇంటర్ బోర్డు ఫలితాల తప్పిదాలపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన అందరికీ తలంటినట్లు తెలుస్తోంది. పరస్పర నిందలు మాని, విద్యార్థుల భవిష్యత్తు కోసం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆయ ఆదేశించారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరి జవాబుపత్రాలను ఉచితంగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాసయిన విద్యార్థులకు కూడా రీకౌంటింగ్ కోరితే వారికి కూడా ఉచితంగా చేయాలని, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలన త్వరగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, మొత్తం గందరగోళానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం జరిగి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అప్పగిస్తున్నానని, తనప్పులు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకర సంఘటనలని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష తప్పితే జీవితం ఆగిపోదని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.