మరింత అందం కోసం చికిత్స...చివరకు ఇలా..!

SMTV Desk 2019-04-24 19:15:37  therm age treatment fails, thaivan

తైవాన్‌: తైవాన్‌లో ఓ మహిళా తన ముఖ చర్మం టైట్ చేసుకునేందుకు చేయించుకున్న చికిత్సతో మొత్తం మొఖాన్ని పాడు చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. పూర్తి వివరాల ప్రకారం...తైవాన్‌కు చెందిన ఓ 50 ఏళ్ళ మహిళ ముఖంపై వదులుగా ఉన్న చర్మాన్ని టైట్ చేయించుకోవాలని థర్మేజ్ చికిత్సను చేయించుకుంది. ఆ చికిత్స కాస్తా బెడిసికొట్లింది. ఆపరేషన్ అనంతరం ఇంటికి వెళ్లిన ఆమెకు సర్జరీ వికటించి ముఖం బొడిపలతో వాచిపోయింది. థర్మేజ్ చికిత్స లో ఉపయోగించే రేడియో-పౌనఃపున్య సాంకేతిక పద్దతిలో జరిగిన అపశృతి ముఖంపై బొబ్బలు రావడానికి కారణమైంది. దీంతో చర్మనిపుణులైన డాక్టర్ లిన్ షాంగ్-లిను సదరు మహిళ సంప్రదించింది. పరిస్థితి విషమమని గుర్తించిన డాక్టర్లు ఆమెకు ఇంటెన్సివ్ కేర్‌లో మూడు వారాల పాటు చికిత్స అందించారు. డాక్టర్ లిన్ షాంగ్-లి తెలిపిన వివరాల ప్రకారం "ముఖం వాచిపోయిన స్థితిలో తీవ్రమైన బాధతో ఆమె మమ్మల్ని సంప్రదించింది. చికిత్స సమయంలో జరిగినపొరపాటు ఈ పరిస్థితికి కారణమైంది. సర్జరీ అనంతరం నుంచే ముఖంపై రెడియేషన్ ప్రభావం చూపించింది. ఆపరేషన్ సమయంలో ఇచ్చిన అనస్తీషియా కారణంగా దాని ప్రభావాన్ని ఆ మహిళ గుర్తించలేకపోయింది. ఈ కారణంగా ఆ విషయాన్ని వారికి తెలియజేయలేకపోయింది. చివరికి దాని ప్రభావంతో ముఖంపై కాలిన గాయాలతో బొబ్బలు ఏర్పడ్డాయి. గాయాలకు చికిత్స చేశాము. ముఖంపై బలమైన గాయాలు ఉన్న కారణంగా పూర్తి చికిత్స అందించలేకపోయాం. రెండు నుంచి మూడు నెలలైనా వేచి ఉండాలని తెలిపారు" ఆమెకు సర్జరీ చేసిన క్లినిక్‌పై చట్టపరమైన చర్యలకు భాదితురాలు ఉపక్రమిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి