యూఎస్ బాక్సాఫీస్ పై నాని జెర్సీ హవా

SMTV Desk 2019-04-24 19:10:25  nani jersey,

నాని నటించిన జెర్సీ సినిమా యూఎస్ లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. నాని, గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అర్జున్ పాత్రలో నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే స్టార్స్ అంతా నాని జెర్సీ చూసి తమ రెస్పాన్స్ తెలియచేశారు. నాని జెర్సీ వసూళ్ల పరంగా కూడా అదరగొడుతుంది. యూఎస్ బాక్సాఫీస్ పై నాని జెర్సీ హవా కొనసాగుతుంది.

ఇప్పటికే జెర్సీ అక్కడ 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసంది. జెర్సీతో మొత్తం ఆరు సినిమాలతో నాని మిలియన్ మార్క్ అందుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా 6 సినిమాలు మిలియన్ మార్క్ అందుకున్నాయి. ఈ లెక్కలో నాని ఎన్.టి.ఆర్ ఈక్వల్ గా ఉన్నారన్నమాట. నాని ఈగ, భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, ఎం.సి.ఏ. నేను లోకల్, జెర్సీ ఆరు సినిమాలు యూఎస్ లో మిలియన్ మార్క్ అందుకున్నాయి.