తాటిముంజలు వడదెబ్బకు విరుగుడు

SMTV Desk 2019-04-24 17:47:59  thati munjulu

తాటిముంజలలోపలి నీరు చాలా ముఖ్యమైంది . ఈ నీళ్లను పదిలంగా తాగితే వేసవి అలసట తీరుతుంది.మండుటెండలో శ్రమపడేవారికి ,దప్పిక అవుతున్న వారికి ,ఎండలో ప్రయాణిస్తున్న వారికీ,వడకొట్టిందనిపిస్తున్న వారికి తాటిముంజల్లో నీళ్ళుతాగిస్తే అలసట ,శోష తగ్గి ,చక్కటి ఆప్యాయత కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి .

ముంజలలోపలి గుజ్జు చలవచేస్తుంది . మూత్రంలో మంటని తగ్గిస్తుంది . మూత్రపిండాల్లో రాళ్లున్నవారికి ఇది వేసవికాలంలో చాలా మేలు చేస్తుంది . కానీ ,ఒక పట్టాన ముంజెలు అరగవు . అతిగా తినకండి .