‘తుంబా’ ట్రైలర్ చూసారా

SMTV Desk 2019-04-24 17:46:55  Tumbha trailer,

‘అడవిలో జంతువులు, మనుషులు కలిసి జీవించగలరు అనుకోని మనుషులు లేకపోతే అసలు అడవులు అనేవే ఉండవు’ అంటున్నాడు నటుడు దర్శన్‌. తాజాగా దర్శన్‌ ‘తుంబా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఎన్‌. సురేఖ నిర్మాణంలో హరీష్‌ రామ్‌ ఎల్‌.హెచ్‌ ఈ సినిమాను లైవ్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో దర్శన్‌ సరసన కీర్తి పాండియన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రెలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.


టాప్‌ స్లిప్‌ కాంట్రాక్ట్‌లో ఓ అడివిలో ఉండటానికి వెళ్లిన వీళ్లు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారో.. ట్రైలర్‌లో కనిపిస్తుంది. ముఖ్యంగా.. అక్కడ పులి, కోతి, ఉడత, ఏనుగు.. వంటి జంతువులతో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ‘ఆపద అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా రావచ్చు.. కానీ దానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేదే ప్రశ్న?’ అంటూ ట్రైలర్‌ మొదలవుతుంది. మే నెలలో ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.