మూత్రంలో మంటకు తరుబూజ పండు మంచి మందు

SMTV Desk 2019-04-24 17:11:26  watermillon

తరుభూజపండు [కర్పూజ పండు ]తియ్యగా ,చల్లగా వుంటుంది . అమితమైన చలవని కల్గిస్తుంది . దీన్ని పంచదార వేసుకొని గానీ లేక జ్యూస్ తీసిగాని వేసవికాలం అంతా రోజూ తీసుకోండి . దప్పిక తగ్గిపోతుంది . వడకొట్టదు . అలసటను పోగొడుతుంది .

టైఫాయిడ్ జ్వరంలో దీన్ని ఇస్తే కడుపులో పుండు పడకుండానూ,పేగులు చిట్లి రక్తం కారకుండాను [perforation ] ఆపగలుగుతుంది . టైఫాయిడ్ జ్వరంలో ఇవి రెండూ ఉపద్రవాలు . ఈ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్తపడాలి . వచ్చాక బాధపడాల్సి వుంటుంది . మూత్రంలో మంట ,పచ్చదనం ,వేడిని తగ్గిస్తుంది . మూత్రపిండాలలోరాళ్లున్నవారికి ఇది అద్భుతమైన ఔషధం .

కానీ ,కొద్దిగా జలుబు చేస్తుంది . ఉబ్బసం ఉన్నవారికి సరిపడకపోతే ఆయాసాన్ని కల్గిస్తుంది .చూసుకొని వాడాలి .