గ్లోబరీనా సంస్థపై కటిన చర్యలు తీసుకోవాలి

SMTV Desk 2019-04-24 17:06:08  pawan kalyan,

ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలపై రాష్ట్రంలో మొదలైన ఆందోళనలు, విద్యార్దుల ఆత్మహత్యలు తదితర పరిణామాలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. “ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లింపు మొదలు ఫలితాల వరకు అంతా చాలా గందరగోళంగా కొనసాగింది. దీనిపై విద్యార్దులు, వారి తల్లితండ్రులకు అనేక అనుమానాలున్నాయి. ఇంటర్ బోర్డు అధికారులు వారి అనుమానాలను నివృత్తి చేసి అవసరమైతే మళ్ళీ పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయాలి. దీనిలో విద్యార్దుల తప్పేమీ లేదు కనుక ఉచితంగా మూల్యాంకనం చేయాలి. ఇంటర్ బోర్డు అధికారులు లేదా దానికి సేవలు అందించిన గ్లోబరీనా సంస్థ సిబ్బంది నిర్వాకం, నిర్లక్ష్యం వలన వేలాదిమంది విద్యార్దులు నష్టపోతున్నారు. అనేకమంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ సమస్యకు కారకులైన అధికారులు లేదా గ్లోబరీనా సంస్థపై కటిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.