మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్

SMTV Desk 2019-04-24 17:03:28  Maharashi

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. మహేష్ మూడు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1న ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో పీపుల్స్ ప్లాజాలో మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్టులుగా మహేష్ తో ఇంతకుముందు తీసిన 24 సినిమాల దర్శకులు అటెండ్ అవుతున్నారని తెలుస్తుంది. మహర్షి మూవీ మహేష్ కెరియర్ లో 25వ సినిమా.. అందుకే ఈ సినిమాను చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కించారు. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన టీజర్ అంచనాలు పెంచగా తప్పకుండా మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా సినిమా ఉంటుందని అంటున్నారు దర్శక నిర్మాతలు.