'దేశముదురు' కాంబో రిపీట్!

SMTV Desk 2019-04-24 15:41:26  deshamuduru, alluarjun, hansika, trivikram srinivas, pooja hegde

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో టబు..తండ్రి పాత్రలో జయరామ్ నటిస్తుండగా, సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం హన్సికను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. గతంలో ‘దేశముదురు’ సినిమాలో అల్లు అర్జున్ సరసన అలరించిన హన్సిక, ఇప్పుడు బన్నీ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేయనుంది. ఈ పాత్రలో హన్సికను కొత్త కోణంలో చూపించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.