సచిన్ టెండూల్కర్ పై ఆసక్తికర ట్వీట్ చేసిన రామ్ పోతినేని

SMTV Desk 2019-04-24 15:35:17  Sachin tendulkar, Ram pothineni

ప్రముఖ భారత క్రికెటర్ శ్రీ రమేష్ సచిన్ టెండూల్కర్ ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు ... అయితే అటు సినీ ప్రముఖులు , క్రికెట్ స్టార్స్ ఈ భారత లెజెండ్ కి బర్త్డే విషెష్ చెప్తున్నారు .. ఇందులో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఆసక్తికర ట్వీట్ చేసాడు .. అదేంటో మనము చూద్దాం ..

ఆత్మహత్యలు చేసుకుంటోన్న ఇంటర్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ట్వీట్ చేశారు. ‘పార్క్‌లో కూర్చుని బిస్కెట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. బెడ్‌రూమ్‌ లాక్ వేసుకుని లైఫ్ ఎలా రా అనుకునే పిల్లలకి.. నిజాలు.. ఇలా చెప్తేనే వింటారు. ఇంటర్ కూడా పూర్తి చేయని, దేశం గర్వించదగిన వ్యక్తి సచిన్ టెండూల్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే, ఇంటర్ కూడా పూర్తిచేయని సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్‌గా ఎదిగినప్పుడు.. ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటని పరోక్షంగా రామ్ ప్రశ్నించారు. సచిన్‌ను స్ఫూర్తిగా చూపించారు. అయితే ఈ ట్వీట్ సామజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది