ఆ నిందితుడికి అస్వస్థత

SMTV Desk 2019-04-24 15:24:09  YS jagan Kodi Kathi Case,

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కోడికత్తిలో దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌ అస్వస్థతకు గురయ్యాడు. అతను మలేరియా జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాస్‌కు జైలులోనే చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌ లోని ఖైదీల వార్డులో డాక్టర్‌ నాయక్‌ పర్యవేక్షణలో శ్రీనివాస్‌కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.

ప్రస్తుతం అతను రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి పోలీసులు కానీ, వైద్యం అందిస్తున్న డాక్టర్లు కానీ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడం లేదు. గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌పై శ్రీనివాసరావు పదునైన కోడికత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించారు.