పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ఫస్ట్ లుక్ ఇదేనా..?

SMTV Desk 2017-08-20 15:40:23  pavan kalyan 25th movie, trivikram, katamarayudu, september 2

హైదరాబాద్, ఆగస్ట్23: "కాటమరాయుడు" చిత్రం తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ చిత్ర షూటింగ్ ప్రారంభమై చాలా రోజులైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు, కాగా పవన్ కల్యాణ్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ఎనౌన్స్ చేస్తారనే వార్తలు వచ్చాయి. అది ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా ఈ చిత్రంలో పవన్ ఇలా కనిపిస్తారంటూ ఓ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఇది నిజామా లేదా అనేది అధికారికంగా ఫస్ట్ లుక్ వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే. ఈ ఫోటోలో పవన్ గడ్డంతో మెడలో స్కార్ఫ్ వేసుకొని చేతిలో గొడుగు పట్టుకుని కూర్చున్నట్లుగా కనిపిస్తున్నారు.