క్రేజీ ఆఫర్ కొట్టేసిన అనసూయ

SMTV Desk 2019-04-24 14:53:28  Anasuya, Hot

యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తూనే అదపాదడపా సినిమా ఛాన్సులు అందుకుంటున్న జబర్దస్త్ అనసూయ రంగస్థలం సినిమాతో మంచి పేరు తెచ్చుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం కథనం సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న అనసూయ మరో మెగా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. సైరా నరసింహా రెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో కలిసి సినిమా చేయాల్సి ఉంది. జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో అనసూయ కూడా నటిస్తుందని తెలుస్తుంది.

ఇప్పటికే ఆ సినిమాలో సునీల్ సెలెక్ట్ అవగా లేటెస్ట్ గా యాంకర్ అనసూయ కూడా ఈ మూవీలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ మూవీ కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తారట. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ అంటే ఇక అనసూయకి తిరుగులేదని చెప్పొచ్చు. అయితే సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది.