టాస్ గెలిచిన చెన్నై

SMTV Desk 2019-04-23 20:19:49  Chennai, CSK, SRH

సన్ రైజర్స్ హైదరాబాద్ పై టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.. శార్దుల్‌ ఠాకూర్‌ స్థానంలో హర్భజన్‌ సింగ్‌ను తీసుకున్నట్లు ధోనీ చెప్పాడు. విలియమ్సన్‌, షాబాజ్‌ నదీం స్థానంలో మనీశ్‌ పాండే, షకీబ్‌ అల్‌ హసన్‌ జట్టులోకి వచ్చినట్లు తాత్కాలిక కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వివరించాడు. తన నానమ్మ చనిపోవడంతో స్వదేశానికి వెళ్లడంతో ఈ మ్యాచ్‌కు కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు.