ప్రారంభం కానున్న ఇంధన కొరత

SMTV Desk 2019-04-23 19:20:46  petrol, iran, america, india, iran exports crude oil to india, iran stops exporting oil to india

న్యూఢిల్లీ, దేశంలో మళ్ళీ ఇంధన కొరత ఏర్పడబోతోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోడానికి భారత్‌కు వీలు కల్పిస్తున్న తాత్కాలిక మినహాయింపును అమెరికా రద్దు చేసింది. భారత్, చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్ సహా ఏడు దేశాలకు అగ్రరాజ్యం ఆరునెలల పాటు మినహాయింపులు ఇచ్చింది. మే 2వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది. అణ్వస్త్రాలు తయారు చేస్తున్న ఇరాక్‌కు బుద్ధొచ్చేలా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఫలితంగా ఇరాన్‌ నుంచి భారత్‌ ముడి చమురు దిగుమతులు ఆగిపోనున్నాయి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే సాహసం భారత్ చేయలేని స్థితిలో లేకపోవడంతో ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం, ధరలు పెంచడం మినహా మరో దారులు కనిపించడం లేదు. అమెరికా నిర్ణయం ఫలితంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిపోయాయి. ఇరాన్‌ నుంచి అధికంగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉంది.