భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న సమంత

SMTV Desk 2019-04-23 18:23:47  Samantha,

మాములుగా ఏ భాషలో ఎలా ఉన్నా పెళ్లైన హీరోయిన్స్ కు అంత మంచి గిరాకి ఉండదు కాని సమంత మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పెళ్లికి ముందు ఎలాంటి ఫాం ఉందో పెళ్లి తర్వాత కూడా అదే సక్సెస్ ఫార్ములా కొనసాగిస్తుంది. రంగస్థలం తర్వాత ఈమధ్య రిలీజైన మజిలీ, తమిళ సూపర్ డీలక్స్ కూడా హిట్ అందుకుంది. ప్రస్తుతం సమంత నందిని రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఓ బేబి, 96 రీమేక్ లకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

పెళ్లికి ముందు కోటి కోటిన్నరకు సినిమా చేసే సమంత పెళ్లి తర్వాత ఆ ప్రైజ్ పెంచేసింది. ఇప్పుడు సమంతతో సినిమా అంటే మాత్రం రెమ్యునరేషన్ చుక్కలు అంటేలా చెబుతుందట. 3 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తేనే తాను చేస్తానని చెప్పిందట. మజిలితో అమ్మడు మరోసారి తన నటనా ప్రతిభ ఏంటో ప్రూవ్ చేసుకోగా సమంత ఉంటే సినిమా హిట్ అన్న సెంటిమెంట్ కూడా కొనసాగించేలా ఉంది. మొత్తానికి అక్కినేని కోడలు సక్సెస్ ఫుల్ కెరియర్ జోరుగా కొనసాగుతుంది.