ఎయిర్‌టెల్ డీటీహెచ్ నయా ఛానల్

SMTV Desk 2019-04-23 18:21:24  airtel dth, airtel, spotlight channel, zee thetare

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ (ఎయిర్‌టెల్ డీటీహెచ్) వినియోగదారుల కోసం మరో కొత్త ఛానల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పాట్‌లైట్ పేరుతో విడుదలవుతున్న ఈ ఛానల్ జీ థియేటర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన థియేటర్ విభాగమే జీ థియేటర్. ఎయిర్‌టెల్ డీటీహెచ్ సబ్‌స్క్రైబర్లు కొత్త ఛానల్‌ను 191లో వీక్షించొచ్చు. ప్రతి సబ్‌స్క్రైబర్ ఈ ఛానల్‌ను ఉచితంగా పొందొచ్చు. అయితే కేవలం 10 రోజులు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. మీకు ఛానల్ నచ్చి, కొనసాగించాలనుకుంటే.. తర్వాత నెలకు రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి ఈ ఛానల్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదంటే యాప్, వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి స్పాట్‌లైట్ ఛానల్ పొందొచ్చు. ట్రాయ్ కొత్త నిబంధనలతో ఇప్పటికే డీటీహెచ్ సబ్‌స్క్రైబర్ల నెలవారీ బిల్లు పెరిగింది. ఇప్పుడు ఈ కొత్త ఛానల్‌కు మళ్లీ నెలకు రూ.75 చెల్లించడమంటే కొంత ఇబ్బందిగానే ఉండొచ్చు. అయితే కొందరు చెల్లించేవారు కూడా ఉండొచ్చు.