ఇంటర్ విద్యార్థులకు ఊరట....రీకౌంటింగ్ గడువు పెంపు

SMTV Desk 2019-04-23 18:18:14  telangana state government, telangana board if intermediate education, recounting

హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్ బోర్డు ఫలితాల తప్పిదాల వల్ల ఇంటర్ బోర్డు తమ తప్పును సరిదిద్దుకోవడానికి సప్లిమెంటరీ పరీక్షలు, రీకౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు గడువు పెంచింది. ఈ నెల 27వ తేదీ వరకు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌, టీఎస్‌ ఆన్‌లైన్‌ సేవా కేంద్రాల్లో చెల్లించడానికి తగిన ఏర్పాట్లు బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. ఫలితాల్లో భారీ స్థాయిలో తప్పులు దొర్లడంతో పెద్దసంఖ్యలో విద్యార్థులు తమ జవాబు పత్రాల రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేస్తున్నాయి. అయితే సైట్లు తెరుచుకోక ఇబ్బంది పెడుతున్నాయి. గడువు ఈ నెల 25తో ముగియనుండడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న బోర్డు గడువు మరో రెండు రోజులు పెంచింది. అయితే ఫీజును ఒక్కో పేపరుకు రూ. 600 కాకుండా సగానికి తగ్గించాలని, పేద విద్యార్థులకు పూర్తిగా రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఫలితాల్లో అవకతవలకపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీ నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో సమావేశమైంది.