పోలింగ్ బూత్‌లో నాటుబాంబుల దాడి...

SMTV Desk 2019-04-23 18:17:00  Murshidabad bomb attack in polling booth, loksabha elections

బెంగాల్: మూడో విడత పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ ప్రాంతాల్లో హింస చెలరేగింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీజేపీ కార్యాకర్తలు బాహాబాహీకి తలపడ్డారు. ఒకరు చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ముర్షీదాబాద్ జిల్లా బలిగ్రామ్‌లోని పోలింగ్ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. బీజేపీ మద్దతుదారులు.. కాంగ్రెస్ పోలింగ్ ఏజెంటును కత్తులతో పొడిచి చంపేశారు. అదే జిల్లాలోని రాణీనగర్‌లో ఓ పోలింగ్ బూత్‌లో గుర్తుతెలియని వ్యక్తి నాటుబాంబులు విసిరాడు. ఈ ఘటనలో ముగ్గురు తృణమూల్ కార్యకర్తకు గాయాలయ్యాయి. మోతీగంజ్‌లో బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు ఒకరి టెంట్లను ఒకరు ధ్వంసం చేసుకున్నారు. రాష్ట్రంలో పలు చోట్లు హింస జరిగిందని, అదనపు బలగాలను మోహరిచి పరిస్థితిని చక్కదిద్దుతున్నామని పోలీసులు చెబుతున్నారు.