ప్రతి ఆటగాడికి తమ పాత్ర ఏంటో తెలుసు: పంత్

SMTV Desk 2019-04-23 18:15:42  rishab pant, delhi capitals, rr vs dc, ipl 2019

జైపూర్: సోమవారం రాత్రి జైపూర్ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ కీలక పాత్ర పోషించి రాజస్తాన్‌ రాయల్స్‌పై ఢిల్లీ జట్టును గెలిపించాడు. పంత్‌ (36 బంతుల్లో 78 నాటౌట్‌ 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. మ్యాచ్ అనంతరం రిషభ్‌ పంత్‌ మాట్లాడుతూ.... చాలా ఆనందంగా ఉన్నాను. ముఖ్యమైన మ్యాచ్‌లో జట్టు విజయం సాధిస్తే వచ్చే ఆనందమే వేరు. నేను అబద్దం చెప్పడం లేదు.. ప్రపంచకప్‌ ఎంపిక ఆలోచన ఇంకా నా మదిలోనే ఉంది. ఆ ఆలోచన నన్ను వదలడం లేదు. అయితే నా కెరీర్‌పై దృష్టి సారించాను. ఈ పిచ్‌ అద్భుతంగా ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. జట్టులోని ప్రతి ఆటగాడికి తమ పాత్ర ఏంటో తెలుసు. దానిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాం అని పంత్‌ తెలిపారు.