క్రికెట్ అభిమానులకు జియో గుడ్ న్యూస్

SMTV Desk 2019-04-23 17:15:10  jio cricket season data pack, jio, jio reliance

క్రికెట్ అభిమానుల కోసం జియో మరో సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ ప్యాక్ ను రూ.251తో రీచార్జ్ చేసుకోవాలి. రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. ప్లాన్ వాలిడిటీ 51 రోజులు. అంటే రూ.251తో రీచార్జ్ చేసుకుంటే 102 జీబీ డేటా వస్తుంది. దీంతో యూజర్లు టీ20 మ్యాచ్‌లు ఉచితంగా వీక్షించొచ్చు. రూ.251 జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌తో యూజర్లు మరిన్ని ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఎక్స్‌క్లూజివ్ వాల్‌పేపర్స్, ఫెవరేజ్ టీమ్ లోగోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మైజియో యాప్‌లోని కూపన్స్ సెక్షన్‌లోకి వీటిని పొందొచ్చు. అలాగే ఫెవరేట్ టీమ్‌తో సెల్ఫీ దిగే అవకాశం కూడా అందుబాటులో ఉంది. మ్యాచ్ టికెట్లను గెలుచుకోవచ్చు. మ్యాచ్ టాస్ సమయంలో గ్రౌండ్‌లోకి వెళ్లొచ్చు. టీమ్ జెర్సీ, క్యాప్స్, బ్యాట్స్ గెలుచుకోవచ్చు. మరోవైపు యూజర్లు జియో క్రికెట్ ప్లే అలాంగ్‌లో పార్టిసిపేట్ చేయవచ్చు. టీ20 మ్యాచ్ జరిగేటప్పుడు ఇందులో పాల్గొనాలి. బాల్ బాల్‌కు ఏమౌతుందో ముందుగానే అంచనా వేయాలి. మన అంచనా నిజమైతే పాయింట్లు వస్తాయి. ఎవరైతే ఎక్కువ పాయింట్లు గెలుచుకుంటారో వారికి అదిరిపోయే బహుమతులు లభిస్తాయి.