ఎవరికి ఓటేసినా...బిజెపికే పడుతుంది: అఖిలేష్

SMTV Desk 2019-04-23 17:02:14  akhilesh yadav, sp party, loksabha elections, evm machines, election commission

లక్నో: ఇవిఎంల పనితీరుపై ఎస్పీ ప్రధానధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరికి ఓటేసినా, అది బిజెపి గుర్తు కుమలానికే వెళుతోందని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మంగళవారం నాటి మూడో విడత పోలింగ్ సందర్భంగా అఖిలేష్ ఇవిఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంమైంది. రామ్ పూర్ లో కావాలనే 350 ఇవిఎంలను మార్చారని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడంతో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయే తప్ప, ఇవిఎంలు సరిగానే పని చేస్తున్నాయని ఎన్నికల అధికారులు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇవిఎంల ట్యాంపరింగ్ జరుగుతుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అఖిలేష్ వాదనలను ఎన్నికల అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఇవిఎంలు ఎటువంటి ట్యాంపరింగ్ గురికావడం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.