ఆన్ లైన్ లో ఆవుల విక్రయాలు

SMTV Desk 2017-06-02 17:59:33  olx, quicker, animal buy,

న్యూఢిల్లీ, జూన్ 2 : పశువుల వధ పై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం ..ఆవుల విక్రయాలకు డిమాండ్ ను విపరీతంగా పెంచేసింది. వ్యవసాయానికి తప్ప పశువధ కోసమై పశువుల క్రయవిక్రయాలు చేయ కుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రైతులు, పశువుల వ్యాపారులు ప్రత్యేక దారులను వేతుకుతున్నారు. అత్యంత సునాయసమైన దారిగా ఆన్ లైన్ విక్రయాలను ఆశ్రయిస్తున్నారు. ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి ఆన్ లైన్ మార్కెట్ వెబ్ సైట్ లు ఆవుల విక్రయాల ప్రకటనలతో హోరేత్తిస్తున్నాయి. ఒక్కో అవును పదివేల కు మెుదలుకొని 3 లక్షల దాక విక్రయిస్తున్నారు. తమ ఆవుల్ని విక్రయించేందుకు ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్నప్పటికి ఎవరు కోనుగోలు చేస్తున్నారు, ఎందుకు కోనుగోలు చేస్తున్నారు అనే విషయాలు పక్కాగా తెలుసుకోని మరి విక్రయిస్తున్నారు. వారణాసికి చెందిన రవిశర్మ తన ఆవును విక్రయించేందుకు ఆన్ లైన్ లో 75వేలకు బేరం పెట్టాడు. అయితే ఆవుతో మీరేం చేస్తారు.. మీరు ఏ వర్గానికి చెందిన వారు ఇత్యాధి విషయాలను సమగ్రంగా తెలుసుకుంటున్నాడు...దీన్ని బట్టి ఆవుల్ని సంహరించే వారికి తన ఆవును విక్రయించనని పరోక్షంగా స్పష్టం చేస్తున్నాడు. అదే విధంగా ఘాజీపూర్ కు చెందిన భీమ్ సింగ్ కూడాతన మూడు అవుల్ని ఆన్ లైన్ లో విక్రయించడానికి ప్రకటన ఇచ్చాడు. పశువుల వధపై నిషేధం విధించారు.. ఇక వాటిని మా దగ్గర ఉంచుకోవడం చాలా ప్రమాదం..ఎవరైనా వచ్చి మమ్మల్ని కొట్టి తీసుకేళ్ళవచ్చని అందుకే విక్రయిస్తున్నానని వివరించారు. ఇదిలా ఉండగా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొందరు సంబురాలు చేసుకుంటుంటే ..మరికొందరు ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం పై దాడిగా కొందరు పేర్కొంటున్నారు.